Saturday, 9 May 2015

ప్రతి ఆడపిల్ల అపురూపమే

చిరునవ్వుల పలకరింపులతో
                సంతోషాల మధురిమలతొ
తన ప్రపంచాన్ని అలంకరించడం ఆమెకు ఇష్టం
సెలయేటి గల గల సవ్వడులలో
              తుమ్మెద జహుమ్కరాలలో
సంగీతం ఆస్వాదించడం ఆమెకు ఇష్టం
దరి చేరని నక్షత్రాలను సైతం
              రంగవల్లులు గా మారుస్తుంది
కన్నీటి చెలమలు చేరువవుతున్న
                  చిరునవ్వుతూ దూరం చేస్తుంది
బ్రతుకుని నేర్పే ప్రతి సంఘటన సాయం తో
                 ధైర్యం గా ముందుకు సాగుతుంది
ఆమె ఎవరా అని అరా తెసిన ప్రతి ఒక్కరికి
                     చక్కని సమాధానం గా మిగిలింది
ఆమె ఒక యువరాణి  నిలిమేఘాల చల్లని చిరుజల్లులకి
ఆమె ఒక యువరాణి రావికిరనాలతో మొదలయ్యే ప్రతి ఉదయానికి
ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఒక చిన్నారి యువరాణి

Wednesday, 22 April 2015

స్నేహం

వికసించెను స్నేహమే ,
                   తొలి రవి కిరణాలూ గా
మనసుని నులివెచ్చగా ,
                    జ్ఞాపకమై చేరేలే ఇలా ...!
కష్టాల కడలి లో ,
                    మన స్నేహ భంధమే
నడిపించెను నావా గా,
                    తీరం చేరేందుకై ....!
ఆ తారల  వరుసలె,
                   స్మృతులకు  ప్రతీకలై
నిసి వేధిలో  స్వేచ్చగా,
                   సరి కొత్తగా విరబూసెలె.......!
 

Sunday, 12 April 2015

suryodayam

పచ్చని పచ్చిక పాడింది ఓ సుమగీతం
వెచ్చని వెలుగుల ఉదయానికి అది  తొలి గీతం